India vs England: మూడో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై టీమిండియా పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించింది. మూడు వన్డేల సిరీస్ ను 3=0 తేడాతో కైవశం చేసుకుంది. పూర్తి స్థాయిలో ఇంగ్లాండ్ పై తన అధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకుంది.
మూడో వన్డేలో ఇంగ్లాండ్ కు భారత్ 357 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్‌మన్ గిల్ (102 బంతుల్లో 112 పరుగులు) సెంచరీ సాధించాడు.
భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ మెదట దీటుగా బ్యాటింగ్ ప్రారంభించినా తరువాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తెసింది 31 ఓవర్లలో ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి ఓటమి కొరల్లో పడిపోయింది.
ఈ దశలో కొద్దిసేపు గస్ అట్కిన్సన్ మార్క్, వుడ్ క్రీజులో మెరుపులు మెరిపించారు.
భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ నుంచి టామ్ బాంటన్ 38, బెన్ డకెట్ 34, జో రూట్ 24, హ్యారీ బ్రూక్ 19, ఫిల్ సాల్ట్ 23 పరుగులు చేశారు.ప్లేయింగ్ XI
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా మరియు అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ మరియు మార్క్ వుడ్.