IND vs AUS

IND vs AUS: సెమీస్ కు ముందు భారత్ కు పెద్ద తలనొప్పి..! ఆస్ట్రేలియా ఏ వ్యూహంతో బరిలోకి వస్తుంది అంటే…

IND vs AUS: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు గ్రూప్ మ్యాచ్లనూ అలవోకగా గెలిచి సెమీఫైనల్స్ లోకి గ్రూప్ టాపర్ గా అడుగుపెడుతోంది. ఇక మంగళవారం ఆస్ట్రేలియాతో జరగబోయే ఈ సెమీస్ లో టీమిండియానే ఫేవరెట్ అని చెప్పాలి. ఆస్ట్రేలియాకు పెద్ద బలగం అయిన ముగ్గురు ప్రధాన పేసర్లు ఈ టోర్నమెంట్ లో లేరు. అంతేకాకుండా అన్ని విభాగాల్లోనూ భారత జట్టే ఆస్ట్రేలియా కంటే మెరుగ్గా ఉంది. అయినప్పటికీ టీమిండియాకు జట్టు కూర్పు విషయంలో ఒక పెద్ద తలనొప్పి రానుంది. దీనిని లక్ష్యంగా చేసుకొని ఆస్ట్రేలియా సెమీస్ లో భారత్ పైన అదనపు ఒత్తిడి పెట్టే ప్రమాదం ఉంది. ఆ మేటర్ ఏంటో ఒకసారి చూసేద్దాం.

ఛాంపియన్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ ఎవరూ ఊహించని విధంగా వరుణ్ చక్రవర్తిని జట్టులోనికి తెచ్చింది. ఎక్కువగా పిచ్ ను అంచనా వేయడంలో మిగిలిన జట్ల తో పోలిస్తే కొద్దిగా వెనుకబడే భారత్ మాత్రం ఈసారి మాత్రం ఈ విషయంలో ఖచ్చితమైన నిర్ధారణకు వస్తోంది. గంభీర్ వరుణ్ చక్రవర్తిని పేసర్ హర్షిత్ రానా స్థానంలో జట్టులోనికి తీసుకొని వచ్చాడు. ఇక భారత్ ఊహించిన విధంగానే పిచ్ మరీ స్లోగా ఉండడం స్పిన్నర్లకు ఎంతో తోడ్పడడంతో టీమిండియా ఒక మాదిరి స్కోరు సాధించినప్పటికీ న్యూజిలాండ్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఈ స్టేడియంలోనే మంగళవారం సెమీస్ జరుగనుండడంతో ఆస్ట్రేలియా తో కూడా భారత్ ఇదే జట్టుని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా ఓపెనరకు అయిన ట్రావిస్ హెడ్ మరియు గాయపడిన షార్ట్ స్థానంలో వచ్చే మెక్ గర్క్ ఎంతో ధాటిగా ఆడే బ్యాటర్లు. పవర్ ప్లే లో వీరు కచ్చితంగా భారత్ పైన వీలైనంత ఒత్తిడి పెట్టాలని అనుకుంటారు. ఎందుకంటే మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు వచ్చి దుబాయ్ పిచ్ పైన బ్యాటర్లను కచ్చితంగా కట్టడి చేస్తారు కాబట్టి పవర్ ప్లే లోనే టీమ్ ఇండియా పై భారీ స్కూరుతో ఒత్తిడి పెడితే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు రన్ రేట్ టెన్షన్ మర్చిపోయి సింగిల్స్ పైన దృష్టి పెట్టొచ్చు.

ఇది కూడా చదవండి: Champions Trophy: భారత్ కు ఏదో మేలు జరుగుతుందని తెగ రుద్దేస్తున్నారు..! అసలు దుబాయ్ వల్ల నష్టపోయేదే టీమ్ ఇండియా

ఇక మనకు పవర్ ప్లే లో పేస్ బౌలర్లు అయిన మహమ్మద్ షమీ మరియు హార్దిక్ పాండ్యా ఎంతవరకు వీరు ఇరువురిని కట్టడి చేస్తారు అన్న విషయం ఇక్కడ పెద్ద సమస్య. ముఖ్యంగా హెడ్ బంతి కొద్దిగా గమనం తప్పింది అంటే బౌండరీకి తరలిస్తాడు. అతనిని పలుమార్లు అవుట్ చేసిన అనుభవం ఉన్న పేస్ బౌలర్ హర్షిత్ రానా సెమీస్ లో ఉండేది అనుమానంగానే ఉంది కాబట్టి షమీ లేదా హార్దిక్ పాండ్యా ఖచ్చితమైన ప్లాన్ తో వచ్చి ఓపెనర్లను వీలైనంత త్వరగా పెవిలియన్ పంపాలి. లేకపోతే తర్వాత వచ్చే స్టీవెన్ స్మిత్ మరియు మార్నస్ లబుషేన్ స్పిన్ చాలా బాగా ఆడతారు కాబట్టి ఓపెనర్లు త్వరగా అవుట్ కాకపోతే… ఆస్ట్రేలియా అనుకున్న దాని కంటే ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి.

ఆ విషయం పక్కన పెడితే ఆస్ట్రేలియా వారి ఉదారు యువపేస్ బౌలర్లలో ఒకరి బదులు స్పిన్నర్ జేసన్ సంఘాను జట్టులోకి తీసుకొని వచ్చే అవకాశాలు కూడా లేకపోలేవు. లెగ్ స్పిన్నర్ సంఘ విరాట్ కోహ్లీకి మంచి సవాల్ విసురుతాడు అని వారు భావించవచ్చు. ఇలా అదనపు స్పిన్ ఆప్షన్ తో కనుక ఆస్ట్రేలియా వచ్చి మొదటి ఇన్నింగ్స్ లో మంచి స్కోరు సాధిస్తే భారత్ నాకౌట్ మ్యాచ్ లో ఒత్తిడిలోనికి పోతుంది. జంపాతో పాటు ఇతను కూడా మంచి బంతులు వేయగలిగితే టీమిండియా బ్యాటర్లకు తిప్పలు తప్పవు. అయితే ఆస్ట్రేలియాతో పోలిస్తే అన్ని విభాగాల్లో బలంగా ఉన్న భారత ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *