Womens Asian Champions Trophy 2024: భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. జోరు కొనసాగిస్తూ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్ లో 2-0తో జపాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి రెండు జట్లూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కానీ తొలి రెండు క్వార్టర్స్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయిదో నిమిషంలో సలీమా కొట్టిన ఓ షాట్‌ను జపాన్ గోల్‌కీపర్ యూకుడో అడ్డుకుంది. దీపిక, ఉదిత కొట్టిన షాట్లు గమ్యాన్ని చేరలేదు. పెనాల్టీకార్నర్లు వరుసగా వచ్చినా రెండు జట్లూ ఫినిషింగ్ లో ఫెయిల్ అయ్యాయి. అయితే 48 నిమిషంలో భారత్ కు లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను సద్వినియోగం చేస్తూ నవ్‌నీత్ కౌర్ స్కోర్ చేసింది. 56 వనిమిషంలో లాల్‌రెమ్సియామి ఫీల్డ్ గోల్ సాధించి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించడంతో గెలుపు నిశ్చయమైంది. . ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 13 పెనాల్టీకార్నర్లు వృథా చేసింది. టైటిల్ పోరులో చైనాతో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన సలీమా బృందం అన్నింట్లోనూ గెలవడం విశేషం. మరో సెమీస్‌లో చైనా 3-1తో మలేసియాను ఓడించింది. ఫైనల్లో భారత్ తో పోరు రెడీ అయింది.