WCL 2025: రల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో భారత్–పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఒక్కసారి కాదు, రెండుసార్లు రద్దవడం కలకలం రేపుతోంది. ఇప్పటికే లీగ్ దశలోనూ భారత్ పాక్‌తో ఆడక మానేసింది. ఇప్పుడు సెమీఫైనల్‌ను కూడా భారత జట్టు బహిష్కరించింది.
ఈ రోజు (జూలై 31) ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ అధికారికంగా రద్దైంది. భారత జట్టు కెప్టెన్ యువరాజ్ సింగ్ నేతృత్వంలోని టీమ్, దేశం మీద ప్రేమను చూపిస్తూ, పాకిస్తాన్‌తో ఆడకూడదని తేల్చేసింది. దీంతో, పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రిది గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు:
అఫ్రిది అప్పటికే మీడియా ముందు మాట్లాడుతూ.. “పాక్ సెమీఫైనల్‌కు వచ్చేసింది. ఇండియా ఏ ముఖంతో మాతో ఆడుతుంది చూద్దాం” అని వ్యాఖ్యానించారు.ఈ మాటలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ట్రోల్లింగ్ చేస్తున్నారు.
భారత్ తుది నిర్ణయం:
భారత్ జట్టు ముందే చెప్పినట్టు, దేశం ముందు మ్యాచ్ ఏమీ కాదన్న నిర్ణయం మీద నిలబడింది. ఈ నిర్ణయంతో, పాకిస్తాన్ నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశముంది. అయితే, దీనిపై టోర్నమెంట్ నిర్వాహకులు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి: AP Free Bus Scheme: ఏపీలో మహిళల ఉచిత బస్సు పథకానికి పేరు ఖరారు
రెండు జట్ల ప్రదర్శన ఇలా ఉంది:
-
ఇండియా ఛాంపియన్స్
టోర్నీ ఆరంభంలో బలహీనంగా ఉన్నా, వెస్టిండీస్‌ను ఓడించి సెమీఫైనల్‌కు వచ్చారు.
స్టువర్ట్ బిన్నీ అర్ధ సెంచరీ, యూసఫ్ పఠాన్ భారీ షాట్లతో జట్టు విజయాన్ని అందుకుంది. -
పాకిస్తాన్ ఛాంపియన్స్
ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది.
సయీద్ అజ్మల్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 6 వికెట్లు తీసి శతృవుల్ని కదిలించాడు.
ఓ మాటలో చెప్పాలంటే…
ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు. భారత్ జట్టు తన నిర్ణయంతో దేశంపై ఉన్న గౌరవాన్ని మరోసారి చూపించింది. ఇక పాక్ కెప్టెన్ అఫ్రిది వ్యాఖ్యలు మాత్రం మంట పుట్టించాయి. సెమీఫైనల్ రద్దుతో అభిమానులు నిరాశ చెంది ఉన్నా, భారత్ జట్టు తీసుకున్న స్టాండ్‌ను చాలా మంది అభినందిస్తున్నారు.