India-Pakistan conflict: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలో తమ దేశం జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వాన్స్ మాట్లాడుతూ, “రెండు అణు శక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం రావడంపై మేమే ఆందోళన చెందుతున్నాం. వీలైనంత తొందరగా పరిస్థితులు శాంతించాలని కోరుకుంటున్నాం. పాకిస్థాన్‌పై భారత్‌కు కొన్ని ఫిర్యాదులున్నాయి. న్యూదిల్లీ చర్యలకు పాక్ స్పందిస్తోంది. పరిస్థితులు తగ్గుముఖం పట్టేలా చేయాలని మేము వీరిని ప్రోత్సహించగలం. కానీ, యుద్ధంలో మాత్రం తలదూర్చం. అది మా పని కాదు. అమెరికాతో దానికి ఏమాత్రం సంబంధం లేదు” అని తెలిపారు.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ – పాక్ దాడులపై భారత ఆర్మీ ప్రకటన
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడి, ఇరు దేశాలు చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని సూచించారు. రుబియో మాట్లాడుతూ, “ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం అవసరం. అది ప్రాంతీయ సంక్షోభానికి దారితీయకుండా చూసుకోవడం” అని అన్నారు.
India-Pakistan conflict: ఇదిలా ఉంటే, భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత సైన్యం పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేసింది. పాక్ సైన్యం కూడా కాల్పులకు తెగబడింది. ఈ పరిస్థితులపై అమెరికా జోక్యం చేసుకోవడం లేదు. అయితే, శాంతి కోసం చర్చలను ప్రోత్సహిస్తోంది.