Kailash Mansarovar Yatra: ఈ ఏడాది వేసవి కాలం నుంచి కైలాష్ మానస సరోవరం యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. దీంతో భారత్-చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు కూడా ప్రారంభం కానుంది. అయితే, దాని తేదీ ఇంకా రాలేదు. ఈ మేరకు విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. బీజింగ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, చైనా మంత్రి వాంగ్ యీ మధ్య రెండు రోజులపాటు జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
2020 నుండి నిలిచిపోయిన యాత్ర..
కైలాష్ మానసరోవర్ యాత్ర, రెండు దేశాల మధ్య విమాన సేవలు 2020 నుండి మూసివేయబడ్డాయి. 2020లో వచ్చిన కోవిడ్ అలాగే రెండు దేశాల మధ్య చెడిన సంబందాలు దీనికి కారణం. జూన్ 2020 లో భారతదేశం, చైనా మధ్య డోక్లామ్ వివాదం వచ్చింది. అంతకు ముందు మార్చిలో కోవిడ్ మొదటి వేవ్ వచ్చింది.
ఇది కూడా చదవండి: Road Accident: కుంభమేళా నుంచి వస్తుండగా ప్రమాదం.. కుటుంబమంతా దుర్మరణం
టిబెట్ లో ఉన్న కైలాష్ మానస సరోవరం..
కైలాష్ మానసరోవర్ కి సంబంధించిన చాలా ప్రాంతం టిబెట్‌లో ఉంది. టిబెట్‌పై చైనా తన హక్కులను క్లెయిమ్ చేస్తోంది. కైలాస పర్వత శ్రేణి కాశ్మీర్ నుండి భూటాన్ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో, ల్హా చు – జాంగ్ చు అనే రెండు ప్రదేశాల మధ్య పర్వతం ఉంది. ఇక్కడ ఈ పర్వతం రెండు అనుసంధాన శిఖరాలు ఉన్నాయి. వీటిలో ఉత్తర శిఖరాన్ని కైలాసంగా పిలుస్తారు.
ప్రయాణానికి చైనా వీసా అవసరం:
భారతదేశం నుండి కైలాష్ మానసరోవర్‌కు రెండు మార్గాలు ఉన్నాయి, కొంతమంది నేపాల్ ద్వారా కూడా ఇక్కడకు వెళతారు. గతేడాది నేపాల్ మీదుగా కైలాస మానస సరోవరం వెళ్లేందుకు 50 వేల మంది యాత్రికులను చైనా అనుమతించలేదు. ఏ మార్గంలోనైనా కైలాష్ మానస సరోవరాన్ని సందర్శించాలంటే, భారతీయులు తప్పనిసరిగా చైనా వీసాను కలిగి ఉండాలి.

