Olympics 2036: ఒలింపిక్స్-2036 కోసం భారత్ తన బిడ్ ను నమోదు చేసుకుంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ అంటే ఐఓసీకి ఈమేరకు లేఖ రాసింది. భారత్ బిడ్ విజయవంతమైతే గుజరాత్‌లోని అహ్మదాబాద్ 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
భారతదేశం తొలిసారిగా ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుండడంతో ఇది చరిత్రాత్మక సందర్భంగా చెప్పవచ్చు. ఒలింపిక్స్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం చుట్టూ ఆరు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 3 లక్షల కోట్లు.
ఇది కూడా చదవండి: Hyderabad: బ్యాంక్ మేనేజర్.. జస్ట్ 4 కోట్లు కొట్టేసాడంతే..
Olympics 2036: ఒలింపిక్స్ 2036 కోసం రూ.4600 కోట్ల వ్యయంతో 215 ఎకరాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌ను నిర్మిస్తున్నారు, ఇది ఒలింపిక్స్‌లో ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయని గుజరాత్ ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.
2036 అవసరాలు, ప్రజల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్రీడా ప్రాంగణాన్ని ప్లాన్ చేశారు. అంతర్జాతీయ – పర్యావరణ ప్రమాణాలు కూడా అధ్యయనం చేశారు.