India vs Oman A: ఏసీసీ ట్వంటీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్. ఏసీసీ ట్వంటీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్ లో తిలక్ వర్మ నేతృత్వంలోని భారత్-ఎ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. ఇంతకుముందే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన మన జట్టు ఆయుశ్ బదోని మెరుపు హాఫ్ సెంచరీకి తోడు..కెప్టెన్ తిలక్ వర్మ నిలకడ..అభిశేక్ శర్మ కేమియో ఇన్నింగ్స్ తో గ్రూప్-బిలో తన ఆఖరి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై ఘన విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకుంది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత ‘ఎ’ జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు .. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఒమన్ బ్యాటర్లలో మొహమ్మద్ నదీమ్ 49 బంతుల్లో 41పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత్ ‘ఎ’ బౌలర్లలో అఖీబ్ ఖాన్, రసిఖ్ సలామ్, నిషాంత్, రమణ్‌దీప్ సింగ్, సాయికిశోర్ తలో వికెట్ కెట్ పడగొట్టారు.
India vs Oman A: 146 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ టీమ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆయుష్ బదోనీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ తిలక్ వర్మ 1 ఫోర్, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా.. అభిషేక్ శర్మ 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 15 బంతుల్లో 34 రన్స్ తో అద్భుతంగా రాణించాడు. దీంతో టీమిండియా 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి అలవోకగా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. శుక్రవారం జరగనున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ తలపడనుంది.