ICC U19 World Cup 2026

ICC U19 World Cup 2026: అండర్-19 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

ICC U19 World Cup 2026:  జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ICC పురుషుల అండర్-19 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టును జూనియర్ క్రికెట్ కమిటీ ప్రకటించింది. జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు ఆయుష్ మత్రే సారథ్యం వహించనున్నారు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. భారత్ గ్రూప్-బిలో ఉంది. మనతో పాటు న్యూజీలాండ్, అమెరికా (USA), బంగ్లాదేశ్ జట్లు ఈ గ్రూపులో ఉన్నాయి. భారత జట్టు తన ప్రయాణాన్ని జనవరి 15న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది.

జనవరి 15: భారత్ vs USA (బులవాయో)

జనవరి 17: భారత్ vs బంగ్లాదేశ్ (బులవాయో)

జనవరి 24: భారత్ vs న్యూజీలాండ్ (బులవాయో)

Also Read: Ashes 2025-26: 94 ఏళ్ల తర్వాత మళ్లీ .. రెండు రోజుల్లోనే

యువ బ్యాటర్ ఆయుష్ మత్రే కెప్టెన్‌గా, విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో భారత అండర్-19 జట్టు దక్షిణాఫ్రికాలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే, మణికట్టు గాయాల కారణంగా కెప్టెన్ ఆయుష్ మత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా ఈ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కానున్నారు. వీరిద్దరూ బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుని, నేరుగా ప్రపంచకప్ సమయానికి జట్టుతో కలుస్తారని బోర్డు స్పష్టం చేసింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్ (2000, 2008, 2012, 2018, 2022), ఆరోసారి ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా హరారే వేదికగా జరిగే ఫైనల్ వైపు అడుగులు వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *