India- America:భారతదేశానికి అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మరో భారీ షాక్ ఇచ్చారు. ఇది నిజంగా దేశానికి కుదుపులాంటి వార్తే అని చెప్పొచ్చు. భారత్‌పై ఇప్పటికే సుంకాలపై సుంకాల విధిస్తున్న ట్రంప్ బాంబుల్లాగా ప్రయోగిస్తూ వస్తున్నారు. తొలుత 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. ఆ తర్వాత మరో 25 శాతం కలిపి మొత్తం 50 శాతం మేరకు సుంకాలను విధించారు. తాజాగా ఆ సుంకాలపై మరో బాంబు పేల్చడం కలకలం రేపింది.
India- America:భారతదేశంతో వాణిజ్య చర్చలు ఉండబోమని డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టారు. సుంకాల వివాదం ఉన్నంతకాలం ఎలాంటి వాణిజ్య చర్చలు జరపబోమని తేల్చి చెప్పారు. రష్యా నుంచి భారతదేశం చమురు ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
India- America:ఇదిలా ఉండగా, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కారణంగా తొలుత అమెరికా అధ్యక్షుడు 25 శాతం సుంకాలను విధించారు. దానిని 50 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని పూర్తిస్థాయి చర్చలకు సిద్ధమని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించగా, అందుకు విరుద్ధంగా ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ మాత్రం చర్చలకు ససేమిరా అన్నారు.
India- America:అమెరికా చర్యలకు తొలుత సరైన అంచనాకు రాని భారత్.. తాజాగా ధీటైన సమాధానమే ఇస్తున్నది. రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తుల రంగం ఉత్పత్తులపై సుంకాల భారాన్ని తమ దేశమే భరిస్తుందని ప్రధాని మోదీ బదులిచ్చారు. సుంకాల భారంపై ట్రంప్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ కూడా సిద్ధమవుతున్నది.
India- America:ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధమేనని భారత్ ప్రకటించింది. భారత వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకుంటామని తెలిపింది. దేశంలోని అన్ని పార్టీలు ట్రంప్ వైఖరిని నిరసిస్తున్నాయి. ట్రంప్ బెదిరింపులకు లొంగరాదని ప్రతిపక్షాలు అధికార పక్షానికి సూచిస్తున్నాయి. దీంతో దేశమంతా ముక్తకంఠంతో ట్రంప్ వైఖరిని ఖండిస్తున్నది.
India- America:ఇదే సమయంలో భారత్‌కు రష్యాతోపాటు చైనా అండగా నిలిచాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నెల (ఆగస్టు) 31న చైనాలో ఎస్‌సీవో సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్‌కు భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. అమెరికా టారిఫ్‌ల వ్యూహాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని భారత్, రష్యా, చైనా నిర్ణయించాయి.