IND vs NZ 1st Test: 37 ఏళ్ల తర్వాత టీమిండియా చెత్త రికార్డు..

టీమిండియా అత్యంత చెత్త రికాడ్డు నెలకొల్పింది. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘోరంగా విఫలమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి రోజు వర్షం కారణంగా ఆట రద్దు అయ్యింది. దీంతో రెండో రోజు గురువారం టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, అనూహ్య రీతిలో భారత్ బ్యాటర్లను దెబ్బ కొట్టారు న్యూజిలాండ్ బౌలర్లు. దీంతో క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయారు. కవీస్ బౌలర్ల ధాటికి టీమిండియా జట్టులో ఏకంగా ఐదుగురు బ్యాట్స్ మెన్లు డకౌటయ్యారు.

పిచ్ పై ఉన్న తేమ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ పేసర్లు టీమిండియా బ్యాటింగ్ లైనప్ ను హడలెత్తించారు. దీంతో భారత్ తన ఇన్నింగ్స్ లో 46 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై టెస్టుల్లో అత్యల్ప స్కోరు చేసిన టీమిండియా చెత్త రికార్డు మూటగట్టుకుంది. 37 ఏళ్ల నాటి చెత్త రికార్డు ఈరోజు మరోసారి రిపీట్ చేసింది టీమిండియా.

ఇప్పటివరకు టెస్టుల్లో టీమిండియా అత్యల్ప స్కోరు 75 పరుగులు. 1987లో ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ పై భారత్ 75 పరుగులకే ఆలౌటైంది. ఇక విదేశాల్లో అత్యల్పంగా 36 పరుగుల స్కోరు చేసింది టీమిండియా. 2020లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అడిలైడ్ టెస్టులో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *