Ind vs sa: భారత్–దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి 73 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా దూకుడుగా బ్యాటింగ్ చేసి 63 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం భారత స్కోర్‌ను భారీ స్థాయికి తీసుకెళ్లింది.
మధ్య ఓవర్లలో దక్షిణాఫ్రికా బౌలర్లు కొంత నియంత్రణ సాధించే ప్రయత్నం చేసినప్పటికీ, చివరి ఓవర్లలో భారత బ్యాట్స్‌మెన్ పరుగుల వర్షం కురిపించారు. ఫలితంగా సౌతాఫ్రికా ముందు 232 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని భారత్ ఉంచింది.
ఇప్పుడు ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. భారత్ బౌలింగ్ విభాగం కూడా ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటే మ్యాచ్ పూర్తిగా టీమిండియా వైపే వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
