Ind vs Eng 3rd T20: ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు t20 మ్యాచ్ ల సిరీస్ లో మూడవ మ్యాచ్ ఈరోజు రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో జరగనుంది. మొదటి రెండు టీ20 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్… ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరొకవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో మూడవ మ్యాచ్ జరగబోయే పిచ్ ఎలా ఉండబోతుంది…? ఇరు జట్లలో మార్పులు చేర్పులు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.
ఈరోజు రాజ్ కోట్ లో జరగనున్న మూడో టి20లో భారత్, ఇంగ్లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించేస్తే… టీమిండియా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. అప్పుడు వారు తమ చివరి రెండు మ్యాచ్ లలో బెంచ్ పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇస్తారు. మరొకవైపు ఇంగ్లాండ్ జట్టు సభ్యులు ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ సత్తా చాటాలని కసితో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే వారు ఒక రోజు ముందే తమ తుది జట్టును ప్రకటించేశారు.
ఇంగ్లాండ్ రెండవ టి20 ఆడిన జట్టుతోనే మూడో టి20 కూడా ఆడనుండడం గమనార్హం. తిలక్ వర్మ వీరోచిత ఇన్నింగ్స్ లేకపోతే ఇంగ్లాండ్ రెండో టి20 గెలిచేది. ఇకపోతే మూడవ మ్యాచ్ కు ఆ జట్టు యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ స్థానంలో జైమీ స్మిత్ జట్టులో కొనసాగనన్నాడు. జాకబ్ బెతెల్ ఇంకా అనారోగ్యం నుంచి కోలుకోనట్లు తెలుస్తోంది. ఇక భారత్ విషయానికి వస్తే పేస్ కు అనుకూలించే రజ్ కోట్ పిచ్ పైన స్పిన్నర్ రవి బిష్నోయ్ ను పక్కనపెట్టి అతని స్థానంలో మహమ్మద్ షమ్మీ లేదా హర్షిత్ రానాలను జట్టులోనికి తెచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: England Fast Bowler: ఏది ఏమైనా తగ్గేదేలే… అంటున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్
Ind vs Eng 3rd T20: ఇక పిచ్ విషయానికి వస్తే సాధారణంగా రాజ్ కోట్ లో బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ లను తయారు చేస్తారు. చివరిగా భారత్ ఇక్కడ ఆడినప్పుడు శ్రీలంక పైన 228 పరుగులు సాధించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో కూడా మొదటి ఇన్నింగ్స్ లో జట్లు సగటున 170 పరుగులకు పైగానే స్కోరు చేయడం గమనార్హం. ఇక ఇక్కడ జరిగిన ఐదు t20ఐ మ్యాచ్లలో సగటున మొదటి ఇన్నింగ్స్ లో 189 పరుగుల స్కోరు నమోదయింది.
ట్రాక్ పైన ఎలాంటి గ్రాస్ లేకుండా ఎంతో ఫ్లాట్ గా కనిపిస్తున్న ఈ పిచ్ పై ఈరోజు భారీ స్కోరు ఖాయం అని చెప్పుకోవచ్చు. అయితే… ఇక్కడ ఛేజింగ్ చేసిన జట్లని ఎక్కువసార్లు విజయం వరించింది కాబట్టి టాస్ కూడా కీలకం కానుంది. కాసేపు మ్యాచ్ పక్కన పెడితే మరొక కీలక విషయం ఏమిటంటే… టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఈరోజైనా జట్టులోకి వస్తాడో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో బుమ్రా పాల్గొనే ఆశలు రోజురోజుకీ సన్నగిల్లుతున్న నేపథ్యంలో షమీ కి ప్రాక్టీస్ అవసరం. అలాగే హర్షిత్ రానా వీలైనంత ఎక్కువ మ్యాచ్ లు ఆడితే బాగుంటుంది. మరి గంభీర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.