Ind vs Bangladesh: టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు వర్షం కారణంగా కేవలం 35 ఓవర్ల మ్యాచ్ మాత్రమే జరిగింది. శుక్రవారం కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా గంట ఆలస్యంగా టాస్ వేశారు.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని.. ముందుగా బంగ్లాదేశ్ జట్టును బ్యాటింగ్ ఆహ్వానించాడు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా ఓపెనర్స్ జకీర్ హసన్(0), షద్మాన్ ఇస్లామ్(24)లు నిరాశపర్చారు. జట్టు స్కోరు 29 పరుగులకే ఓపెనర్స్ వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్.
Ind vs Bangladesh: ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ శాంటో, మొమినల్ హక్ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో లంచ్ సమయానికి బంగ్లా రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. ఆ తర్వాత మరోసారి వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో రెండో సెషన్ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది.
UPDATE 🚨
Due to incessant rains, play on Day 1 has been called off in Kanpur.
Scorecard – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/HSctfZChvp
— BCCI (@BCCI) September 27, 2024
Ind vs Bangladesh: ఈ క్రమంలో బంతి అందుకున్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ శాంటో(31)ను పెవిలియన్ కు పంపించాడు.తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్ తో కలిసి మొమినల్ హక్.. జట్టు బాధ్యతను తీసుకున్నాడు. ఈ క్రమంలో 35 ఓవర్లలో జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 107 పరుగుల వద్ద ఉండగా.. మళ్లీ వర్షం రావడంతో ఆటను నిలపేయాల్సి వచ్చింది.వర్షం తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
Also Read: ఒక్క మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..
Ind vs Bangladesh: ప్రస్తుతం క్రీజులో మొమినల్ హక్ (40), ముష్ఫికర్ రహీమ్ (6)లు ఉన్నారు.ఇక, భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. కాగా, చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ 2-1తో క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తున్నది. మరోవైపు, రెండో టెస్టులోనైనా విజయం సాధించి సిరీస్ ను డ్రాగా ముగించాలని బంగ్లాదేశ్ పట్టుదలగా ఉంది.
