IND vs AUS

IND vs AUS: సెమీస్ లో చెలరేగిన కోహ్లీ..! కంగారూలు ఇంటికి, భారత్ ఫైనల్స్ కి

IND vs AUS: దుబాయ్ జరిగిన చాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ లోనికి అడుగుపెట్టింది. ఈ విజయంతో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ మ్యాచ్లో భారత్ విజయంలో చిలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్ లో మహమ్మద్ షమీ మూడు వికెట్లతో అదరగొడితే రెండోవైన్నింగ్స్ లో కోహ్లీకి తోడుగా శ్రేయా అయ్యర్, కే ఎల్ రాహుల్ భారత్ విజయానికి తోడ్పడ్డారు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులతో ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును ముందు ఉండి నడిపించాడు. అలాగే అలెక్స్ క్యారీ 57 బంతుల్లో 61 పరుగులు చేసి ఆస్ట్రేలియా 300 చేసే స్థితికి తీసుకెళ్లాడు.

అయితే మొదటి ఇన్నింగ్స్ ద్వితీయార్థంలో పుంజుకున్న భారత బౌలర్లు ఆకర్ల వరుస వికెట్లను తీసి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. ముహమ్మద్ షమీ 3 వికెట్లు తీస్తే, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరొక రెండు వికెట్లు పడగొట్టారు.

267 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో భారత్ కొద్దిగా సునాయాసంగానే చేధించింది అని చెప్పాలి. విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 5 ఫోర్లతో 84 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు, కేఎల్ రాహుల్ 42 పరుగులతో అతనికి మంచి సహకారాన్ని ఇవ్వగా… హార్దిక్ పాండ్యా 28 చివర్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియన్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా ఇద్దరు రెండు వికెట్లు తీశారు.

Also Read: Bail for Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ కు బెయిల్.. నాలు సంవత్సరాల తరువాత బయటకు

IND vs AUS: భారత్ ఇన్నింగ్స్ ఎలా సాగింది అంటే…
– ప్రారంభంలో షుభ్మన్ గిల్ 8 పరుగులకు అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ 28 పరుగులు చేసి కూపర్ కొన్నోల్లీ బౌలింగ్లో బోల్తా కొట్టాడు.
– పవర్ ప్లే లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ఇన్నింగ్స్ ను కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ మధ్య 91 పరుగుల భాగస్వామ్యంతో స్థిరపరిచారు. అయితే, అయ్యర్ అనవసర కట్ షాట్ ఆడి 61 బంతుల్లో 45 పరుగులంచేసి అవుట్ అయ్యాడు.
– తర్వాత కోహ్లీ మరియు రాహుల్ మధ్య 44 పరుగుల స్టాండ్ కొనసాగింది. కోహ్లీ సెంచరీకి కొద్దిగా దూరంలో క్యాచ్ అయ్యాడు, కానీ రాహుల్ మరియు పాండ్యా అప్పటికే భారీ షాట్లతో రన్ రేట్ ఒత్తిడిని తగ్గించారు.
– చివరి దశలో హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 28 పరుగులు వేగంగా చేస్తే, రాహుల్ విజయ సిక్సర్తో మ్యాచ్ ను ముగించారు.

ఈ విజయంతో భారత జట్టు వరుసగా రెండోసారి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ కు అర్హత సాధించినట్లు అయింది. ఈరోజు న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే రెండవ సెమీస్ లోని విజేతతో ఆదివారం భారత్ దుబాయ్ లోనే ఫైనల్స్ ఆడుతుంది. మరి గతసారి అనూహ్యంగా పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలై భారత్ ఈసారైనా తమ మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంటుందో లేదో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *