Sabarimala:శబరిమల తులమాస పూజల నేపథ్యంలో అయ్యప్ప భక్తుల రాక పెరిగింది. ఈ నెల 16వ తేదీన ఈ ప్రత్యేక పూజల కోసం స్వామివారి సన్నిధానం తెరిచారు. ఈ నెల 21న సన్నిధానాన్ని మూసివేస్తారు. దీంతో దేవస్థానం వారు ఊహించని రీతిలో భక్తులు తరలివచ్చారని అంటున్నారు. శనివారం ఒక్కనాడే 52 వేల మంది భక్తులకు పైగా దర్శనం చేసుకున్నారని దేవస్థానం ప్రకటించింది. 16 నుంచి కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చిన భక్తుల సంఖ్య శనివారం నాటికి అనూహ్యంగా పెరిగిందని తెలిపారు.
Sabarimala:శబరిమల తులమాస పూజలకు ఊహించని రీతిలో భక్తులు తరలిరాగా, సరిగా రక్షణ చర్యలు చేపట్టలేదని భక్తుల ద్వారా తెలిసింది. తిండి, నీరు లేక గంటల తరబడి పెద్ద క్యూలలో చిక్కుకున్న భక్తులు కొంత ఇబ్బందులు పడ్డారు. స్వామివారికి ఉదయాస్తమాన పూజ, పడి పూజ కారణంగా భక్తులను క్యూలలో చాలాసేపు నిలుపుదల చేశారు. వచ్చే మండల పూజలకు భక్తుల రాకకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.