Vishakapatnam: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఆదివారం ఉదయం 5:20 గంటల సమయంలో తిరునల్వేలి-పురిలియా రైలు స్టేషన్‌కు చేరుకుంది. రైలు ఇంజిన్ ముందుకు కదులుతున్న క్రమంలో అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగిపడి రైలుకు అడ్డుగా పడ్డాయి. రైలు ఆగకపోవడంతో తీగలను కొంత దూరం ఈడ్చుకెళ్లింది.
ఈ ప్రమాదాన్ని గమనించిన స్టేషన్ సిబ్బంది తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పి ప్రయాణికుల ప్రాణాలు రక్షించబడ్డాయి. పరిస్థితిని నియంత్రించేందుకు రైల్వే సిబ్బంది విద్యుత్ తీగల మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ చర్యలను డీఆర్‌ఎం పరిశీలిస్తున్నారు.
ఈ పరిణామాల వల్ల పలు రైళ్లు నిలిచిపోయి రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రయాణానికి ముందుగా తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని సలహా ఇవ్వబడింది.

