రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బండ్లగూడ జాగిర్ కార్పోరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లో నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు భర్త. వివరాల్లో కి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్, భార్య కృష్ణవేణి పిల్లలతో కలిసి మాధవి నగర్ లో నివాసముంటున్నాడు.
అయితే గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస్ ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. భార్య నిద్రపోతున్న సమయంలో ఆమెను చంపి పిల్లలను తీసుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు శ్రీనివాస్. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
.