INCA

INCA: తొలి ‘ఐఎన్సీఏ’ (INCA) అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌లో నాగ చైతన్య, అనిల్ రావిపూడిలకు అగ్రస్థానం!

INCA: భారతీయ సినీ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోని 12 భాషలు, 12 సినిమా ఇండస్ట్రీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏర్పాటైన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA), ఈ ఏడాదికి గానూ తొలి ‘ఐఎన్సీఏ అవార్డ్స్’ విజేతలను ప్రకటించింది. మొత్తం 25 విభాగాల్లో అనుభవజ్ఞులైన జ్యూరీ సభ్యులు విజేతలను ఎంపిక చేశారు.ఈ అవార్డుల వేడుక ఏప్రిల్ 16న ముంబైలో అత్యంత వైభవంగా జరగనుంది.

తెలుగు సినిమా విజేతలు (Tollywood):

తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రముఖ నటులు, దర్శకులు ఈ అవార్డులలో సత్తా చాటారు.

  • ఉత్తమ నటుడు: నాగ చైతన్య (చిత్రం: తండేల్)

  • ఉత్తమ నటి: రష్మిక మందన్న (చిత్రం: ది గర్ల్‌ఫ్రెండ్)

  • ఉత్తమ దర్శకుడు: అనిల్ రావిపూడి (చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం)

  • ఉత్తమ చిత్రం: మిరాయి సూపర్ యోధా (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ)

ఇతర ప్రధాన భాషల విజేతలు:

హిందీ (Bollywood):

  • ఉత్తమ నటుడు: రణవీర్ సింగ్ (ధురంధర్)

  • ఉత్తమ నటి: యామి గౌతమ్ ధర్ (హక్)

  • ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్)

  • ఉత్తమ చిత్రం: ఛావా (మాడ్‌డాక్ ఫిలిమ్స్)

కన్నడ (Sandalwood):

  • ఉత్తమ నటుడు & దర్శకుడు: రిషబ్ శెట్టి (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)

  • ఉత్తమ నటి: రుక్మిణి వసంత్ (కాంతార)

  • ఉత్తమ చిత్రం: కాంతార (హోంబలే ఫిలిమ్స్)

తమిళం (Kollywood):

  • ఉత్తమ నటుడు: దుల్కర్ సల్మాన్ (కాంతా)

  • ఉత్తమ నటి: సిమ్రాన్ (టూరిస్ట్ ఫ్యామిలీ)

  • ఉత్తమ దర్శకుడు: మారి సెల్వరాజ్ (బైసన్ కాలమాడన్)

  • ఉత్తమ చిత్రం: టూరిస్ట్ ఫ్యామిలీ (మిలియన్ డాలర్ స్టూడియోస్)

మలయాళం (Mollywood):

  • ఉత్తమ నటుడు: నివిన్ పాలీ (సర్వం మాయ)

  • ఉత్తమ నటి: కళ్యాణి ప్రియదర్శన్ (లోక చాప్టర్ వన్: చంద్ర)

  • ఉత్తమ చిత్రం: లోక చాప్టర్ వన్: చంద్ర (వే ఫారర్ ఫిలిమ్స్)

ముంబైలో వేడుక:

భారతీయ సినిమా రంగానికి చెందిన ప్రముఖులు, టెక్నీషియన్లు మరియు నిర్మాతలు పాల్గొనే ఈ అవార్డుల ప్రధానోత్సవం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. పన్నెండు ఇండస్ట్రీలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ అకాడమీ ప్రత్యేకత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *