Borabanda

Borabanda: బోరబండలో తీవ్ర ఉద్రిక్తత: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు

Borabanda: హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో హిజ్రాల మధ్య తలెత్తిన అంతర్గత వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమను ఓ హిజ్రా తప్పుడు కేసులతో, వేధింపులతో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ మరికొందరు హిజ్రాలు బహిరంగంగా నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా కొందరు హిజ్రాలు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితి విషమించింది.

ఈ ఘటనలో ముగ్గురు హిజ్రాలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బోరబండ సీఐతో పాటు మరికొందరు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

Also Read: Mahesh Kumar goud: బీహార్‌లో ఎన్డీయే విజయం దొడ్డి దారినే సాధించినదే

గాయపడిన హిజ్రాలను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఆందోళన కారణంగా బోరబండ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత వేధింపులు, తప్పుడు కేసులు వంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిరసన మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *