Air ambulance crash: అమెరికాలోని అరిజోనాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోగులను తరలించడానికి వెళ్తున్న ఒక ఎయిర్ అంబులెన్స్ కూలిపోవడంతో నలుగురు మరణించారు. మృతుల్లో వైద్య సిబ్బంది ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. చిన్లే మునిసిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నవాజో నేషన్ ప్రాంతంలో ఒక ఆసుపత్రి నుంచి రోగిని తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. విమానం ల్యాండ్ అవుతుండగా కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం.
Also Read: Nikki Haley: ట్రంప్ సుంకాల పెంపు.. నిక్కీ హేలీ సంచలన కామెంట్స్
ఈ విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు కూడా వైద్య రంగంలో పనిచేస్తున్న వారే. రోగుల ప్రాణాలను కాపాడేందుకు తమ జీవితాలను అంకితం చేసిన వారిని కోల్పోవడం బాధాకరమని నవాజో నేషన్ అధ్యక్షుడు బుయు నైగ్రెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) అధికారులు విచారణ మొదలుపెట్టారు. విమానం కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది.