Kannappa Movie: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో కన్నప్ప టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇప్పటికే శివా శివా శంకర పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి.
Also Read: Vikram: తెలుగు స్టేట్స్ మంచి ధర పలికిన విక్రమ్ సినిమా!
అయితే తాజాగా విష్ణు మంచు ‘కన్నప్ప’ మేకింగ్ వీడియోని విడుదల చేశాడు. తాము ఈ సినిమా కోసం ఎంత అధ్యయనం చేశామో, ఎన్ని డిస్కషన్లు జరిపామో, ఎంత హార్డ్ వర్క్ చేశామో ఈ వీడియో ద్వారా తెలుపుతూ మంచు విష్ణు వివరించారు. దర్శకుడితో కలిసి తాను 24 క్రాఫ్ట్స్ తో ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ వీడియోలో స్పష్టంగా తెలిపాడు. వీడియో చూస్తుంటే మూవీ కోసం టీం సభ్యులు ఎంత కష్టపడ్డారో అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో ఆకట్టుకుంటూ తెగ వైరల్ అవుతుంది.