Chittoor: చిత్తూరు జిల్లా….కుప్పం లోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి మూలలు తెలుస్తున్నాయని పూర్తి సమాచారంతో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో రాళ్ళబుడుగురు,గుడుపల్లి ఎస్ ఐ లు నరేష్, శ్రీనివాసులు సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించగా రామకుప్పం మండలం కుప్పిగానిపల్లి కి చెందిన జయప్ప, గురుకులమడుగు గ్రామానికి చెందిన గోవిందస్వామి, కృష్ణన్, శాంతిపురం మండలం అబకలదొడ్డి గ్రామంకి చెందిన చంద్రప్ప, ఇంటివద్ద కొంతమంది గంజాయి సాగు చేస్తుండటం తో వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.
Chittoor: అదేవిధంగా కుప్పం అర్బన్ పరిధిలో లో అర్బన్ సీఐ GT నాయుడు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీ లు నిర్వహించమని సామాగుట్టపల్ల చెందిన హనుమంతు ,చిగాలపల్లి కిచెందిన రామచంద్రప్ప ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించామని డీఎస్పీ పార్థసారధి విలేకర్లు సమావేశంలో వివరించారు. యువత కూడా చాలా వరకు గంజాయి వ్యసనానికి బానిసలూ అవుతున్నారని పిల్లల్ని తల్లితండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని అన్నారు.
ఇది కూడా చదవండి: car purchasing tips: పండక్కి కారు కొంటుంన్నారా? ఈ విషయాలను చెక్ చేయకపోతే బుక్ అయిపోతారు!!
Chittoor: కుప్పం నియోజకవర్గం లో ఎక్కడైనా గంజాయి సేవించిన, విక్రయించిన, సాగు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని కుప్పం డిఎస్పీ పార్థసారధి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు నియోజకవర్గం లో ఆణువణువు జల్లెడ పట్టడం జరుగుతోందని గంజాయి కి సంబంధించిన కేసులో ఎవరు ఉన్న వదిలేపరిస్థితి లేదని అన్నారు. ఈ సమావేశంలో చిన్నస్వామి, పరమేష్, నటరాజ్ , రత్నప్ప, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.