Ilayaraja: సంగీత మాంత్రికుడు ఇళయరాజాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం (సెప్టెంబర్ 13) చెన్నైలో ఇళయరాజా సంగీత ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో స్టాలిన్ ఈ ప్రకటన చేశారు.కేవలం తమిళనాడు ప్రజల తరపున మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇళయరాజా అభిమానుల పక్షాన ఈ అభ్యర్థన చేస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు. ఇళయరాజా తన సంగీతంతో భాషా, భౌగోళిక సరిహద్దులను దాటి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారని స్టాలిన్ అన్నారు.
ఇది కూడా చదవండి: AP NEW DISTRICSTS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలపై సర్వత్రా ఉత్కంఠ.. ఆ కొత్త జిల్లాలు ఇవేనా?
ఇదే కార్యక్రమంలో, యువ సంగీతకారులను ప్రోత్సహించడానికి ఇళయరాజా పేరు మీద “ఇసైజ్ఞాని ఇళయరాజా అవార్డు”ను నెలకొల్పనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.ఇప్పటికే ఇళయరాజాకు పద్మభూషణ్ (2010), పద్మవిభూషణ్ (2018) వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. సంగీతంలో ఆయన చేసిన విశేష కృషికి గాను, ఆయనకు భారతరత్న ఇవ్వాలని పలువురు ప్రముఖులు, అభిమానులు గతంలో కూడా డిమాండ్ చేశారు. ఎం. కె. స్టాలిన్ చేసిన ఈ తాజా విజ్ఞప్తి ఇప్పుడు మళ్ళీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

