Jana Nayagan: ఇళయ దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’. ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఆ అంచనాలకు తగ్గట్లే దూసుకుపోతుంది. ఓవర్సీస్ మార్కెట్‌లో విజయ్ కి మాములు క్రేజ్ లేదు. ఆ క్రేజ్ కి తగ్గట్టే ఈ సినిమా రికార్డు బిజినెస్ చేసింది. యూఎస్ మినహా మిగతా దేశాల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. దీంతో హైప్ పెరిగిపోవడంతో ఈ సినిమా గల్ఫ్, సింగపూర్, మలేషియాల్లో గట్టి టార్గెట్ పెట్టింది.
Also Read: Tamannaah: చిరుతో తమన్నా స్పెషల్ సాంగ్!
ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’. తెలుగులో ‘జన నాయకుడు’గా రానుంది. ఖాకి దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్‌గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ అందిస్తోంది. అయితే ఓవర్సీస్ బిజినెస్‌పై లేటెస్ట్ గా ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. విజయ్ సినిమాలకు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్ ఉంది. అక్కడి నుంచే చాలా వసూళ్లు ప్లస్ అవుతాయి. దీంతో ‘జన నాయగన్’ గట్టి బిజినెస్ చేసింది. ఒక్క యూఎస్ మార్కెట్ మినహా మిగతా దేశాల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించిందని టాక్. గల్ఫ్ దేశాలు, సింగపూర్, మలేషియా వంటి చోట్ల భారీ టార్గెట్ పెట్టింది. విజయ్ కెరీర్లోనే భారీ బిజినెస్ జరిగిందట. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఓవర్సీస్ నుంచి ఎంత రాబడి వస్తుందో చూడాలి. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ కుట్టి మమిత భైజు కీలక పాత్రలో నటిస్తుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

