Ikkis Trailer: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా నటిస్తున్న ‘ఇక్కీస్’ ట్రైలర్ విడుదలైంది. పరమవీర చక్ర విజేత అరుణ్ ఖేతర్‌పాల్ బయోపిక్ ఇది. ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: Lokesh Kanagaraj: లోకేష్‌తో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్!
1971 ఇండో-పాక్ యుద్ధంలో 21 ఏళ్ల వయసులోనే అసాధారణ ధైర్యం ప్రదర్శించి పరమవీర చక్ర అందుకున్న సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత కథ ఆధారంగా ‘ఇక్కీస్’ సినిమా రూపొందుతోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద అరుణ్ పాత్రలో నటిస్తూ డెబ్యూ చేస్తున్నారు. దిగ్గజ నటుడు ధర్మేంద్ర, ‘పాతల్ లోక్’ ఫేం జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ కి ‘అంధాధున్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చింది దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుండగా, ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. యుద్ధ సన్నివేశాలు, వాస్తవ సంఘటనలు కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ట్రైలర్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అరుణ్ ఖేతర్‌పాల్ త్యాగం, పోరాట పటిమను గౌరవిస్తూ ఈ సినిమా రూపొందింది. మరణానంతరం పరమవీర చక్ర లభించిన ఆ వీరుడి కథ ప్రేక్షకులను కదిలిస్తుంది. సినిమాలో అగస్త్య నటన, యుద్ధ దృశ్యాలు హైలైట్‌గా నిలుస్తాయట. మొత్తంమీద ఈ చిత్రం దేశభక్తిని రగుల్చే సినిమాగా మారనుంది.


