Diwali: దేశమంతా దీపావళి వెలుగులు, సందడి మొదలయ్యింది. ఈ సంవత్సరం, అంటే 2025లో, దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు జరుపుకోబోతున్నాం. దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవిని పూజించడం మాత్రమే కాదు, ఆ రోజున మనం చూసే కొన్ని వస్తువులు లేదా జంతువులకు కూడా ప్రత్యేకమైన శుభ సంకేతం ఉంటుందని పెద్దలు చెబుతారు.
ఆశ్వయుజ అమావాస్య రోజున వచ్చే ఈ దీపావళి పండుగ హిందువులకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున గణేశుడు మరియు లక్ష్మీదేవిని కలిపి పూజిస్తే, ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయని, జీవితం సురక్షితంగా ఉంటుందని నమ్మకం. ప్రజలు తమ ఇళ్లు, దుకాణాలు, ఆఫీసులను దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు.
మరి, దీపావళి పండుగ నాడు ఏయే వస్తువులను చూస్తే అదృష్టం, సిరి సంపదలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంకేతాలు కనిపిస్తే, మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని అర్థమట!
లక్ష్మీ కటాక్షాన్ని సూచించే ముఖ్యమైన సంకేతాలు:
1. గుడ్లగూబ : లక్ష్మీదేవి వాహనం
పాత గ్రంథాలలో చెప్పిన ప్రకారం, గుడ్లగూబ (Owl) లక్ష్మీదేవికి వాహనం. దీపావళి పవిత్ర దినాన మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే, అది చాలా మంచి సంకేతం. త్వరలో మీపై లక్ష్మీదేవి ఆశీస్సులు లభించబోతున్నాయని అర్థం. అంతేకాదు, మీకున్న డబ్బు ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం త్వరలోనే దూరమవుతుందని గట్టి నమ్మకం. ఈ శుభ సంకేతాన్ని అస్సలు విస్మరించకూడదు.
2. కమలం పువ్వు : సంపదకు చిహ్నం
సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కమలం పువ్వుపైనే కూర్చుంటుంది. ఆమె చేతిలో కూడా కమలమే ఉంటుంది. దీపావళి పండుగ సమయంలో మీరు కమలం పువ్వును చూస్తే, అది మీ సంపద పెరగబోతోందని సూచిస్తుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుందని దీని అర్థం. అందుకే దీపావళి పూజలో లక్ష్మీదేవికి కమలం పువ్వును సమర్పించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
3. కాకి : పూర్వీకుల ఆశీర్వాదం
దీపావళి పండుగ రోజున మీరు కాకిని చూసినా లేదా మీ ఇంటి ఆవరణలోకి కాకి వచ్చినా.. అది మీకు మీ పూర్వీకుల నుంచి ఆశీర్వాదం లభిస్తున్నట్లుగా భావించాలి. శాస్త్రాల ప్రకారం, కాకిని పూర్వీకుల చిహ్నంగా చెబుతారు. కాబట్టి, పండగ రోజున కాకి మీ ఇంటి టెర్రస్‌పై లేదా ప్రాంగణంలో వాలితే, మీపై పెద్దల దీవెనలు ఉన్నాయని నమ్మకం.
ఇతర శుభ సంకేతాలు:
దీపావళి రోజున ఈ కింది వాటిని చూడడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు:
* ఆవులు: హిందూ సంప్రదాయంలో ఆవును పవిత్రంగా, లక్ష్మీదేవితో సమానంగా చూస్తారు.
* బల్లులు: బల్లులు కనిపించడం కూడా కొన్ని ప్రాంతాల్లో మంచి సంకేతంగా భావిస్తారు.
* హిజ్రాలు(Transgender): వీరిని చూడటం కూడా మంచి సమయానికి, సానుకూల శక్తి పెరుగుదలకు సంకేతంగా జ్యోతిష్కులు చెబుతారు.
ఈ పండుగ రోజున వీటిని చూడడం వల్ల మీ జీవితంలో మంచి సమయం మొదలవుతుందని, సానుకూల శక్తి (Positive Energy) పెరుగుతుందని పెద్దల నమ్మకం.
కాబట్టి, దీపావళి రోజున మీ చుట్టూ ఉన్న ఈ చిన్న చిన్న సంకేతాలను గమనించండి.
