Rice: గతంలో పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు ఎక్కువగా అన్నం తినే వారు వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడేవారు అన్నం తగ్గించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే బియ్యంలో చక్కెరను పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక్కటే సమస్య కాదు. రోజుకు మూడు పూటలా అన్నం తినే వారికి భవిష్యత్తులో ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేవలం అన్నం మాత్రమే తినేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అది డయాబెటిస్ కు దారితీస్తుంది. ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు అన్నం తగ్గించడం మంచిది. మీరు బరువు పెరుగుతున్నారంటే, మీ ఆహారంలో అన్నం మొత్తాన్ని పెంచుతున్నారని అర్థం. మహిళల్లో, థైరాయిడ్, PCOD వంటి సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు. అందువల్ల కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా, మీరు ఆరోగ్యాన్ని, బరువును సులభంగా కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Homemade Onion Oil: ఉల్లిపాయతో ఇలా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే.. జుట్టు రాలనే రాలదు
అన్నంలో పోషకాలు తక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి నెమ్మదిగా మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రతిరోజూ అన్నం మాత్రమే తినేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతాయి. ఇవి గుండె జబ్బులకు దారితీస్తాయి. ప్రతిరోజూ అన్నం మాత్రమే తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం క్రమంగా పెరుగుతుంది. అంటే ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల బరువు పెరగడం, జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే వైద్య నిపుణులు అన్నాన్ని మితంగా మాత్రమే తినాలని అంటున్నారు.

