Idly Kadai: కోలీవుడ్ స్టార్ ధనుష్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నిత్య మీనన్ జంటగా.. ఇడ్లీ కడై మూవీ రాబోతోంది. దీనికి డైరెక్టర్ కూడా ధనుష్షే మరి. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఇస్తున్నాడు. శ్వేతా మోహన్ తో కలిసి ధనుష్ పాడిన ఎన్నసుగం సాంగ్ వైరల్ అవుతుండగా.. క్రేజీ న్యూస్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.
సముద్రఖని, షాలిని పాండే కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే, షాలిని, ధనుష్ చెల్లిగా కనిపించనుందట. అరుణ్ విజయ్ బావగా నటిస్తున్నాడని టాక్. అలాగే సీనియర్ యాక్టర్ ఆర్.పార్తిబన్ అతిథి పాత్రలో మెరవనున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. అక్టోబర్ 1న ఇడ్లీ కడై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకీ ఇడ్లీ కడై అంటే అర్థం ఏంటంటే.. ఇడ్లీ కొట్టు అన్నమాట..
