WTC Points Table

WTC Points Table: WTC ఖాతా తెరిచిన భారత్.. పాయింట్ల పట్టిక ఎలా ఉందో చూడండి !

WTC Points Table: ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో పెద్ద మార్పులు జరిగాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన ఖాతాను తెరిచింది. అటు వెస్టిండీస్‌పై సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా ఆస్ట్రేలియా తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని జట్టు 50 PCTతో 12 పాయింట్లతో ఉంది. ఇంగ్లాండ్ కూడా 12 పాయింట్లతో ఉంది.

బంగ్లాదేశ్ 4 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది, ఆదివారం ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్‌మన్ గిల్ (269) డబుల్ సెంచరీ సాధించగా, యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. సిరాజ్ 6 వికెట్లు తీయగా, ఆకాష్‌దీప్ 4 వికెట్లు పడగొట్టాడు.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 6 వికెట్లకు 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ గిల్ (161) రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ సాధించాడు. 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయి 336 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆకాష్‌దీప్ 6 వికెట్లు తీసి భారత్ గెలుపులో కీ రోల్ పోషించాడు

ఇది కూడా చదవండి:

Yash Dayal: బిగ్ షాక్ .. ఆర్సీబీ బౌలర్‌ యశ్‌ దయాళ్‌పై కేసు నమోదు!

Shubman Gill: ఒకే ఒక్కడు.. ఇంగ్లాండ్ గడ్డపై కెప్టెన్ గిల్ రికార్డుల మోత!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *