IB Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కింద 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, దరఖాస్తు చేసుకోవడానికి గడువు రేపటితో (ఆగస్టు 17, 2025) ముగియనుంది. ఇప్పటివరకు అప్లై చేయని అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు & అర్హతలు
-
మొత్తం పోస్టులు: 4,987
-
నియామక విభాగం: దేశవ్యాప్తంగా ఉన్న 37 Subsidiary Intelligence Bureaus (SIBs)
-
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత తప్పనిసరి.
-
సంబంధిత భాష/మాండలికంలో చదవడం, రాయడం, మాట్లాడగల సామర్థ్యం ఉండాలి.
వయో పరిమితి
-
కనీసం: 18 సంవత్సరాలు
-
గరిష్టం: 27 సంవత్సరాలు (ఆగస్టు 17, 2025 నాటికి)
-
వయో సడలింపు:
-
SC/ST – 5 సంవత్సరాలు
-
OBC – 3 సంవత్సరాలు
-
ఇది కూడా చదవండి: Heavy Rain Alert: ఆ 9 జిల్లాల్లో నేడూ భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:
-
టైర్ – 1 రాత పరీక్ష
-
టైర్ – 2 రాత పరీక్ష
-
ఇంటర్వ్యూ
జీతం (Pay Scale)
ఎంపికైన వారికి నెలకు ₹21,700 – ₹69,100 జీతం లభిస్తుంది.
దరఖాస్తు రుసుము
-
UR/OBC/EWS పురుషులు: ₹650 (దరఖాస్తు ఫీజు + ప్రాసెసింగ్ ఛార్జీలు)
-
SC/ST/మహిళలు/Ex-Servicemen: ₹550
-
చెల్లింపు Debit Card/Credit Card/UPI/Net Banking/Challan ద్వారా చేయవచ్చు.
దరఖాస్తు విధానం
-
అధికారిక వెబ్‌సైట్ mha.gov.in సందర్శించండి.
-
హోమ్‌పేజీలో “IB Security Assistant/Executive Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
-
కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, లాగిన్ అవ్వండి.
-
దరఖాస్తు ఫారమ్ నింపి, ఫీజు చెల్లించండి.
-
సమర్పించిన తర్వాత నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.
డైరెక్ట్ అప్లికేషన్ లింక్: IB Recruitment 2025 Apply Here
గమనిక: దరఖాస్తు గడువు రేపు, ఆగస్టు 17, 2025 వరకు మాత్రమే. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి.