Naga Chaitanya: తండేల్ సినిమా సక్సెస్ తో అక్కినేని ఫ్యామిలీకి సూపర్ హిట్ దక్కింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కింగ్ నాగార్జున ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. తండేల్ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నేపథ్యంలో నాగార్జున తన తనయుడు నాగచైతన్యను మెచ్చుకున్నారు. తండేల్ సినిమా సెట్స్ మీద ఉన్నప్పటి నుంచే పాజిటివ్ వైబ్ వచ్చింది. ఇక సాంగ్స్ తో సూపర్ బజ్ క్రియేట్ అవ్వగా ఆల్బమ్ చార్ట్ బస్టర్ లిస్ట్ లో చేరింది. ఫైనల్ గా సినిమా అంచనాలను అందుకోవడంతో తండేల్ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది.
