Ravichandran Ashwin: భారత జట్టు లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత నెలలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా అతను ఎవరు ఊహించని సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అశ్విన్ గురించి భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచంలోని మేటి స్పిన్నర్లు ప్రస్తావన వస్తే అందులో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు ప్రముఖంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో అతను సాధించిన ఘనత, రికార్డులు అసామాన్యం. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే దిగ్గజ క్రీడాకారులో ఒకడైన అశ్విన్ కు ఘోరమైన అవమానం జరిగిందని భారత సీనియర్ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో రెండవ టెస్టు అనంతరం రవి అశ్విన్ అనూహ్య రీతిలో అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న అశ్విన్ మరికొంతకాలం ఆడుతాడని భారత క్రికెట్ అభిమానులు ఆశించారు. అయితే ఎవరి ఊహకి అందని రీతిలో అతను ప్రొఫెషనల్ క్రికెట్ కు స్వస్తి పలికాడు.
ఈ విషయంపై మనోజ్ తివారీ వారి మాట్లాడుతూ… భారత క్రికెట్ మేనేజ్మెంట్ చేసిన అవమానం వల్లే అశ్విన్ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగిన టెస్టులలో ఆఫ్ స్పిన్నర్ కోటాలో అశ్విన్ జట్టులో ఉండగా మరొక ఆఫ్ స్పిన్నర్ అయిన వాషింగ్టన్ సుందర్ ను టీం లోనికి తీసుకోవడం అవమానకరమైన నిర్ణయం అని అతను భావిస్తున్నాడు. అశ్విన్ తో పాటుగా జడేజా, కుల్దీప్ ఉన్న సమయంలో కూడా వాషింగ్టన్ జట్టులో ఉండడం అనేది మింగుడుపడని విషయమని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Tilak Varma: మరొక ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన తిలక్ వర్మ..!
Ravichandran Ashwin: అంతేకాకుండా ఆస్ట్రేలియాలో జరిగిన మొదటి టెస్టులో అశ్విన్ బదులుగా సుందర్ తుది జట్టులో చోటు సంపాదించాడు. సుందర్ ఆల్రౌండర్ అయినప్పటికీ… అశ్విన్ కూడా ఆల్రౌండర్ గా ఎంతో మంచి రికార్డు కలిగిన ప్లేయర్. ఆస్ట్రేలియాలో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చిన అశ్విన్ ను కాదని సుందర్ జట్టులోకి రావడంతోనే అతను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తివారి చెప్పుకొచ్చాడు.
అశ్విన్ చాలా మంచి వ్యక్తి అని… అందుకని ఈ విషయాన్ని అతను ఇప్పుడు బయట పెట్టట్లేదు కానీ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తాను కూడా ఇదే అభిప్రాయాన్ని బయటపెడతాడని మనోజ్ తివారి విశ్వాసం వ్యక్తం చేశాడు. మరి ఏదేమైనప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే తరచుగా సోషల్ మీడియాలో అభిమానులతో క్రికెట్ కు సంబంధించి చర్చలు జరిపే అశ్విన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.