Narendra Modi

Narendra Modi: పేదల కోసం కోట్లాది ఇళ్లు కట్టించా.. నేను కట్టుకోలేదు.. ప్రధాని మోదీ

Narendra Modi: ‘‘దేశవ్యాప్తంగా పేదల కోసం కోట్లాది ఇళ్లు కట్టించాను. కానీ నేను ఇల్లు కట్టుకోలేదు. నేను తలచుకుంటే ఓ భారీ గ్లాస్ హౌస్ కట్టి ఉండేవాడిని.” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ఆమ్ ఆద్మీ ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లుగా విపత్తులో కూరుకుపోయిన ఢిల్లీని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణం – విద్యా శాఖ తరపున వివిధ పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 

కేంద్ర గృహనిర్మాణ శాఖ ‘స్వాబిమాన్’ పథకం కింద న్యూఢిల్లీలోని అశోక్ విహార్‌లో మురికివాడల నివాసితుల కోసం ఫ్లాట్‌ హౌస్‌లను నిర్మించారు. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసే కార్యక్రమం నిన్న జరిగింది. వారికి  ఇంటి తాళాలు అందజేసి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పేదల కోసం ఇప్పటివరకు నాలుగు కోట్లకు పైగా ఇళ్లు నిర్మించాను. కానీ నాకు ఇల్లు కట్టలేదు. నేను కావాలనుకుంటే, నా కోసం ఒక పెద్ద గ్లాస్ హౌస్ కట్టించుకుని ఉండేవాడిని అన్నారు. గత 10 సంవత్సరాలుగా, ఢిల్లీ పెను విపత్తులతో కొట్టుమిట్టాడుతోంది. సామాజిక కార్యకర్త అన్నా హజారేను ముందు పెట్టి  కొందరు దుష్ట, చిత్తశుద్ధి లేని వ్యక్తులు ఢిల్లీని విపత్తులో పడేశారు అని విమర్సించారు. 

ఇది కూడా చదవండి: Gold Price Today: మూడో రోజూ రప్పా.. రప్పా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు!

ఢిల్లీ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. 

కానీ ఢిల్లీ ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో పాఠశాల విద్య నుండి ప్రతి శాఖను నాశనం చేస్తోంది. ఢిల్లీ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది. అంటూ ప్రధాని ఆప్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీని చుట్టుముట్టిన విపత్తు నుంచి కాపాడేందుకు యుద్ధం ప్రారంభించాం. ఢిల్లీ ప్రజలు ఈ పోరాటాన్ని భుజానికెత్తుకుని ఎన్నికల్లో ఆమ్ ఆద్మీని ఇంటికి పంపాలి అంటూ పిలుపు నిచ్చారు.


ఈ కొత్త సంవత్సరంలో దేశ నిర్మాణం, ప్రజా సంక్షేమం అనే కొత్త రాజకీయాలను బీజేపీ ప్రవేశపెట్టనుంది. అందువల్ల, విపత్తు శక్తిని తొలగించి, బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి ఢిల్లీ ప్రజలు ముందుకు రావాలని ప్రధాని కోరారు. 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: 10 ల‌క్ష‌ల జ‌నాభా @ 21 మంది జ‌డ్జీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *