Hydra: హైడ్రా మార్షల్స్ సమస్యలపై కమిషనర్ రంగనాథ్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, హైడ్రాలో పనిచేస్తున్న ఎవరి జీతాలూ తగ్గించబోమని స్పష్టం చేశారు. మార్షల్స్ జీతాలు ఇంకా పెరుగుతాయని, ఓవర్‌టైమ్ అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. జీతాల విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదిస్తానని హామీ ఇచ్చారు.
మార్షల్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, కమిషనర్ హామీ మేరకు రెండు నెలల్లో జీతాలు పెరుగుతాయని, మూడు నెలలు వేచి చూస్తామని తెలిపారు. చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వారు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.