HYDRAA

HYDRAA: 100 సర్వే నెంబర్‌లో భారీ అక్రమ నిర్మాణం.. మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

HYDRAA: ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన హైడ్రా (HMDA Enforcement Wing) బృందం, అక్రమ నిర్మాణాలపై మరోసారి కఠినంగా వ్యవహరిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని ఆమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో పోచారం మున్సిపాలిటీలలో చేపట్టిన భారీ కూల్చివేతల ఆపరేషన్లలో అనేక అక్రమ కట్టడాలను నేలమట్టం చేయడంతో పాటు, కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

అమీన్‌పూర్-మియాపూర్ సరిహద్దులో భారీ అపార్ట్‌మెంట్ కూల్చివేత

నవంబర్ 1న ఉదయం ఆమీన్‌పూర్, చందానగర్ సరిహద్దు ప్రాంతాల్లో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 100లో ఉన్న స్థలాన్ని ఆక్రమించి, దొంగ రికార్డులు సృష్టించారు. అక్రమార్కులు సర్వే నంబర్లను 307, 308 గా మార్చి తప్పుడు పత్రాలు సృష్టించారు.

ఇది కూడా చదవండి: Viral News: వివాహ బంధంతో ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, ఫ్రాన్స్‌ అమ్మాయి

హెచ్‌ఎండీఏ ఫెన్సింగ్‌ను తొలగించి, ఏకంగా ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, నిర్మాణం అక్రమంగా తేలడంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు.

పోచారంలో రూ. 30 కోట్ల పార్కు స్థలం స్వాధీనం

అక్టోబర్ 31న, హైడ్రా బృందం పోచారం మున్సిపాలిటీ పరిధిలో సుమారు ₹30 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని విజయవంతంగా కాపాడింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న 4 వేల గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థలంలో లేఔట్ వేసినవారే కబ్జాకు పాల్పడినట్లు హైడ్రా గుర్తించింది. ఆముదాల రమేష్ అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్స్‌తో 4 వేల గజాలను 800 గజాల చొప్పున 5 ప్లాట్లుగా కులకర్ణి అనే వ్యక్తికి అమ్మినట్లు తేలింది. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, ఆక్రమణల కూల్చివేతలు చేపట్టి, ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నివారణకు హైడ్రా బృందం తమ ఆపరేషన్లను కొనసాగిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *