Hydra Commissioner: నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని మూసాపేట పరిధిలో ఉన్న కాముని చెరువును హైడ్రా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన మాట్లాడారు. హైడ్రా ఏర్పడక ముందు చేపట్టిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని తేల్చి చెప్పారు. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేతస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయక తప్పదని చెప్పారు.
Hydra Commissioner: కొత్తగా ఇటీవల తీసుకున్న అనుమతులనూ హైడ్రా పరిశీలిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న వాటివైపు కూడా తాము వెళ్లబోమని చెప్పారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందని వివరించారు. పేదల, చిన్నవారి ఇండ్లనే హైడ్రా కూల్చివేస్తుందనే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

