Hyderabad:పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగతున్నాయి. ఏప్రిల్ 27లోగా పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. ఆ మేరకు హైదరాబాద్ నగరంలో 209 మంది పాకిస్తానీయులు ఉన్నట్టు కేంద్రం గుర్తించింది. వారందరినీ బయటకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీచేసి, కేంద్రం జారీ చేసిన వీసాలను రద్దు చేసింది.
Hyderabad:ఈ మేరకు రాష్ట్ర పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మహ్మద్ ఫయాజ్‌గా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఫయాజ్ గతంలో దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ జీవించేవాడని, ఇటీవల హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసింది.
Hyderabad:తన భార్యను కలిసేందుకు పాకిస్తాన్ నుంచి నేరుగా రాకుండా, నేపాల్ దేశం వెళ్లి అక్కడి నుంచి భారత్‌లోకి ప్రవేశించి చివరకు హైదరాబాద్‌కు చేరుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మహ్మద్ ఫయాజ్ ఎలా భారత్‌లోకి ప్రవేశించాడు? ఎవరు సాయం చేశారు? ఆ వ్యక్తులు ఎవరు? అతడి రాక వెనుక మరే ఉద్దేశం ఉన్నదా? అన్న కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Hyderabad:ఫయాజ్ ప్రయాణించిన వివరాలు, వీసా సమాచారం, నేపాల్ నుంచి వచ్చిన రవాణా వివరాలు, అతడి ఇతర సంబంధాపై అధికారులు సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయ్యాక అతడిని పాకిస్తాన్‌కు తిరిగి పంపే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Hyderabad:అదే విధంగా హైదరాబాద్‌లో ఉన్న ఇతర పాకిస్తానీయుల కోసం పోలీసులు నిఘా ఉంచారు. నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులను పంపారు. షార్ట్ టర్మ్ వీసా హోల్డర్లుగా ఉన్నట్టు గురించారు. రేపటిలోగా (ఏప్రిల్ 27) హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో 213 పాకిస్తానీయులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు 209 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నట్టు గుర్తించారు.