Hyderabad:

Hyderabad: మార్పింగ్ న్యూడ్ ఫొటోలతో వేధింపులు.. హైద‌రాబాద్‌ వ్య‌క్తి బ‌లి

Hyderabad:ఆన్‌లైన్‌ మోసాలు ఇంతింత కాద‌యా.. అన్న‌ట్టుగా మితిమీరి పోతున్నాయి. ఈ మోసాల కార‌ణంగా అవ‌త‌లి వ్య‌క్తికి ఏం జ‌రిగితే మాకేంటి? అనే రీతిలో ఆ వేధింపులు జ‌రుగుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్ వ్య‌క్తికి జ‌రిగిన ఈ వేధింపుల కార‌ణంగా అత‌ని ప్రాణ‌మే బ‌లైంది. న్యూడ్ మార్పింగ్ ఫొటోల‌తో ఓ ముఠా బెదిరింపుల‌కు హైద‌రాబాద్‌కు చెందిన ఆ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకొని కుటుంబానికి శోక‌మే మిగిల్చాడు.

Hyderabad:హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాంగ‌న‌ర్ ప్రాంతంలో నివాసం ఉండే ప్రేమ్‌కుమార్ (36) అనే వ్య‌క్తికి సెల్ ఫోన్ ద్వారా మార్పింగ్ ద్వారా ఆయ‌న న్యూడ్ ఫొటోల‌ను పంపారు. ఆ వెంట‌నే రూ.3,000 న‌గ‌దు ఇవ్వాల‌ని, లేకుంటే ఇత‌ర కుటుంబ స‌భ్యుల న్యూడ్ ఫొటోలు బ‌య‌ట పెడ‌తామంటూ ఆ ముఠా బెదిరింపుల‌కు దిగింది. ఈ విష‌యాన్ని త‌న కుటుంబ స‌భ్యుల‌కు చెప్పి మ‌ద‌న‌ప‌డ్డాడు.

Hyderabad:ఆ ముఠా బెదిరింపుల‌కు భ‌య‌ప‌డిన బాధితుడు ప్రేమ్‌కుమార్ నిజంగా ఆ న‌గ‌దు పంపించాల‌ని భావించాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌కు డ‌బ్బులు పంపితే, మ‌ళ్లీ మ‌ళ్లీ అడుగుతార‌ని, ఈ విష‌యాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు చేద్దామ‌ని కుటుంబ స‌భ్యులు అత‌నికి ధైర్యం చెప్పారు. ఈలోగా ప‌దేప‌దే కాల్స్ చేస్తూ న‌గ‌దు పంపాల‌ని, లేదంటే ఇత‌ర కుటుంబ స‌భ్యుల న్యూడ్ ఫోటోలు పెడుతామ‌ని హెచ్చ‌రించ‌సాగారు.

Hyderabad:దుండ‌గుల‌ బెదిరింపుల‌తో మ‌న‌స్తాపం చెందిన ప్రేమ్‌కుమార్ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కానీ, ముందే ఈ విష‌యాన్ని పోలీసుల‌కు చేర‌వేస్తే, వ‌ల‌ప‌న్ని ఆ దుండ‌గుల‌ను ప‌ట్టుకొనేవారు, నిండు ప్రాణం బ‌లి కాకుండా ఉండేది. ఇలాంటి విష‌యాల్లో ధైర్యంగా ఉండి ఎదుర్కోవాల‌ని మాన‌సిక వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *