Hyderabad: అలర్ట్.. రేపు ఎల్లుండి రెండు రోజులు వైన్స్ మూసివేత

Hyderabad: నగరంలోని మద్యం ప్రియులకు ఇది షాకింగ్ వార్తే. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు వైన్స్‌ (మద్యం దుకాణాలు) మూసివేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్‌ క్లోజ్‌ చేయనున్నారు. ముఖ్యంగా సెంట్రల్‌ హైదరాబాద్‌, ఈస్ట్‌ జోన్‌, నార్త్‌ హైదరాబాద్‌ ప్రాంతాల్లో అన్ని మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఈ నిర్ణయానికి భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే సంబంధిత వైన్స్ లైసెన్సును రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rohit Sharma: రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ బాడీషేమింగ్‌.. భాజపా ‘రాహుల్‌’ కౌంటర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *