Hyderabad: డబ్బుల కోసం భర్తను కిడ్నాప్ చేసిన భార్య

Hyderabad: అంబర్‌పేటలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 29న శ్యామ్‌ను దుండగులు అపహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

🔹 శ్యామ్ కిడ్నాప్‌కు అతడి మాజీ భార్య మాధవీలతే సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు.
🔹 అమెరికాలో శ్యామ్, మాధవీలత దాంపత్య జీవితం కలిసిరాక మూడేళ్లకే విడిపోయారు.
🔹 విడాకుల తర్వాత శ్యామ్ తన పేరును అలీగా మార్చుకొని ఫాతిమాతో రెండో వివాహం చేసుకున్నాడు.
🔹 అమెరికా నుంచి తిరిగి వచ్చిన శ్యామ్ కదలికలను మాధవీలత గమనించింది.
🔹 సుపారీ గ్యాంగ్‌కు ఆదేశించి శ్యామ్‌ను కిడ్నాప్ చేయించి రూ.1.5 కోట్లు డిమాండ్ చేసింది.

అయితే శ్యామ్‌ కిడ్నాప్ గ్యాంగ్‌ నుంచి తప్పించుకొని పోలీసులకు చేరాడు. శ్యామ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు గ్యాంగ్‌లోని 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *