Crime News

Crime News: ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం

Crime News: హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఓ మహిళా రోగిపై వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

జూలై 14న చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళా రోగిపై, అక్కడ పని చేస్తున్న వార్డ్ బాయ్ అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడు. అతని ప్రవర్తనను భరించలేని మహిళ గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న సిబ్బంది, బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. వార్డ్ బాయ్‌ను అక్కడికక్కడే చితకబాదారు.

ఇది కూడా చదవండి: Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది..! దింతో భారత్ లో మరణాలు తగ్గినట్టే

తర్వాత నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇలాంటి సంఘటనలు మహిళల భద్రతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆసుపత్రిలాంటి ప్రదేశాల్లోనూ మహిళలు భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలని ఆమె కుటుంబం కోరుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *