Petrol Pump Scam: హైదరాబాద్ నగరంలో వాహనదారులకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో తలలు పట్టుకుంటున్న వారు… ఇప్పుడు పెట్రోల్ పంపుల్లో జరుగుతున్న మోసాలతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉప్పల్‌లోని ఓ భారత్ పెట్రోల్ పంపులో భారీ మోసం వెలుగు చూసింది.
బాటిల్‌లో పెట్రోల్ పోస్తే మోసం బయటపడింది
ఉప్పల్ మెహిఫిల్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ పంపులో ఈ మోసం జరిగినట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. వారు బాటిల్‌లో రూ.100కి పెట్రోల్ పోయించగా, పొందిన పరిమాణం తక్కువగా ఉందని గుర్తించారు. దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడం ఇవ్వకుండా ఏదోదో చెపుతున్నారు.
మిషన్ సెట్టింగ్ ద్వారా మోసం?
వాహనదారుల ఆరోపణల ప్రకారం, ఆయా పెట్రోల్ పంపుల్లో మిషన్ సెట్టింగులతో లేదా ఎలక్ట్రానిక్ చిప్‌లతో తక్కువ మోతాదులో పెట్రోల్ అందిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీటర్‌ను రీసెట్ చేయకపోవడం, ముందుగానే ఓ మొత్తంలో లీటర్లను చూపించడం లాంటి కుతంత్రాలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Akhila Priya: అందరికీ టార్గెట్ తనే.. అంత అలుసైపోయారా?
అధికారుల జోక్యం అవసరం
ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. నిర్ధిష్టంగా ఓ భారతీయ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన భారత్ పెట్రోల్ పంపులో ఇలా మోసాలు జరగడం తీవ్రంగా విమర్శలకు దారి తీస్తోంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ తరహా మోసాల నుండి తప్పించుకోవాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకించి బాటిల్‌ల్లో పెట్రోల్ పోసే సమయంలో, మీటర్ రీడింగును జాగ్రత్తగా గమనించాలి. అనుమానం వచ్చినపుడు వెంటనే వీడియో తీయడం, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం మంచిది.