Hyderabad: ఆరోగ్యం కోసం చేసే ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్‌లోని నాగోల్ షటిల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు ఆస్పత్రికి తరలించేలోపే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటనలో మృతిచెందిన యువకుడిని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్‌గా గుర్తించారు. రాకేష్ తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు.
రాకేష్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఎలక్ట్రానిక్ కార్ షోరూమ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి ప్రతిరోజూ షటిల్ ఆడే అలవాటు ఉంది. ఆదివారం రాత్రి అలవాటు ప్రకారం, నాగోల్ స్టేడియంలో స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతున్నాడు. ఆట మధ్యలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియక స్నేహితులు వెంటనే అతని వద్దకు పరుగెత్తి లేపే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను స్పృహ కోల్పోవడంతో, వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. చేతికి వచ్చిన కుమారుడు ఇలా అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రాకేష్ స్వగ్రామమైన తల్లాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ మధ్య ఇలాంటి మరణాలు ఎక్కువైపోతున్నాయి
షెటిల్ కోర్టులో కుప్పకూలిన యువకుడు
నాగోల్‌లోని ఓ స్టేడియంలో షెటిల్ ఆడుతూ గుండెపోటుతో మరణించిన రాకేష్ 25 ఏళ్ల యువకుడు మృతి
మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడుగా గుర్తింపు#heartattack #nagole pic.twitter.com/UIE507b9db
— s5news (@s5newsoffical) July 28, 2025
