Bullet Train

Bullet Train: 2 గంటల్లో 629 కి. మీ.. రైల్వే శాఖ సరికొత్త ప్లాన్

Bullet Train: దేశంలో బుల్లెట్ రైలు విస్తరణకు కేంద్రం భారీగా ప్రణాళికలు చేస్తుంది. ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతుండగా, 2030 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొనిరావాలని చూస్తుంది. ఇదే విధం గా  రైల్వే శాఖ  సౌత్ ఇండియాపై దృష్టి సారించింది.

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్

దక్షిణ భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు కారిడార్‌ను హైదరాబాద్-చెన్నై మార్గంలో తీసుకురావాలని నిర్ణయించారు. నవరత్న పీఎస్‌యూ సంస్థ RITES ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనం చేస్తోంది. ఇందులో:

  • ట్రాఫిక్ విశ్లేషణ

  • డిమాండ్ అంచనాలు

  • అలైన్‌మెంట్ సర్వేలు

  • ప్రయాణీకుల అవసరాల అంచనా

పూర్తి చేసిన తర్వాత డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయనుంది.

ఇది కూడా చదవండి: REPORT TO AICC ON TG: ఆ మంత్రులపై వేటు వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో హైకమాండ్‌!

కేవలం 2 గంటల 20 నిమిషాల్లో హైదరాబాద్-చెన్నై ప్రయాణం

ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నైకి రైలులో వెళ్లడానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. అయితే బుల్లెట్ రైలు ప్రారంభమైతే ఈ ప్రయాణం కేవలం 2 గంటల 20 నిమిషాల్లో (140 నిమిషాలు) పూర్తవుతుంది. ఇది రెండు నగరాల మధ్య వ్యాపారం, పర్యాటకం, ఉద్యోగావకాశాలకు కొత్త దారులు తీసుకురానుంది.

నాలుగు నగరాలకు కనెక్టివిటీ – ఆర్థిక వృద్ధికి ఊతం

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాజెక్ట్‌పై కీలక ప్రకటనలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఈ బుల్లెట్ రైలు నెట్‌వర్క్ హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలను కలుపుతుందని తెలిపారు.

  • ఈ నాలుగు నగరాల పరిధిలోనే 5 కోట్లకు పైగా జనాభా నివసిస్తోందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటని, ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధికి, కనెక్టివిటీకి విప్లవాత్మక మార్పు తీసుకురావనుందని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు నెట్‌వర్క్

రైల్వే శాఖ గతంలో జాతీయ రైలు ప్రణాళికలో పలు హైస్పీడ్ రైలు మార్గాలను ప్రకటించింది:

  • ఢిల్లీ – వారణాసి

  • ఢిల్లీ – అహ్మదాబాద్

  • ముంబై – నాగ్‌పూర్

  • ముంబై – హైదరాబాద్

  • చెన్నై – మైసూర్

  • ఢిల్లీ – అమృత్‌సర్

  • వారణాసి – హౌరా

ఇవన్నింటికి తోడు తాజాగా హైదరాబాద్-చెన్నై మార్గంను కూడా చేర్చారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణ భారత రవాణా వ్యవస్థలోనే కాదు, దేశ వ్యాప్తంగా కొత్త రవాణా విప్లవానికి నాంది పలికే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu Naidu: దావోస్ లో చంద్రబాబు..ఏపీ కి భారీ పెట్టుబడులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *