Drugs Case: మహానగరంలో మత్తు మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) రాజేంద్రనగర్ పోలీసులు కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ దందాకు సంబంధించిన కీలక ఆధారాలు, బెంగళూరు లింకులు బయటపడ్డాయి.
బెంగళూరు టు హైదరాబాద్ డ్రగ్స్ చైన్ బద్దలు
డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులు.. సాయిబాబు, విశాల్ రెడ్డి, సమీర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 2 లక్షలు విలువ చేసే 18 గ్రాముల MDMA, 130 గ్రాముల గంజాయి సహా 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Horoscope Today: ఆ రాశికి ఆకస్మిక ధనలాభ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ముగ్గురిని అరెస్ట్ చేసి విచారించగా ఈ డ్రగ్స్ దందా వెనుక సంతోష్, సందీప్, శివ కుమార్ అనే ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్లు తీసుకొని, పెడ్లర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నైజీరియన్ కనెక్షన్!
బెంగళూరు డ్రగ్స్ డొంక కదలడంతో పాటు ఈ వ్యవహారంలో అంతర్జాతీయ లింకులు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ, డ్రగ్స్ సరఫరాకు నైజీరియన్ లింకులు ఉన్నట్లు గుర్తించామన్నారు. నైజీరియా నుంచి డ్రగ్స్‌ను బెంగళూరుకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. ‘నైజీరియా టు హైదరాబాద్ వయా బెంగళూరు’ సాగుతున్న ఈ డ్రగ్స్ చైన్‌ను త్వరలోనే బ్రేక్ చేస్తామని డీసీపీ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Crime News: శ్రీ.. ఐయామ్ సారీ.. ఈ చీమలతో బతకడం నావల్ల కాదు..వివాహిత సూసైడ్
పోలీసులు ప్రస్తుతం సంతోష్, సందీప్, శివ కుమార్ డ్రగ్ డెలివరీ డైరీపై దృష్టి సారించారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, కన్స్స్యూమర్ల సంఖ్య ఎంత అనే దానిపై లోతుగా ఆరా తీస్తున్నారు.
డీసీపీ యోగేష్ గౌతమ్ హెచ్చరిక.. డ్రగ్స్ వాడినా, అమ్మినా, కొన్నా, డ్రగ్ దందాకు సహకరించినా కఠిన చర్యలు తప్పవని ఆయన యువతను, ప్రజలను హెచ్చరించారు.

