7 Year Old Boy Murder

7 Year Old Boy Murder: ఏడేళ్ల బాలుడిపై దారుణంగా హత్య

7 Year Old Boy Murder: ఏడేళ్ల బాలుడి పై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్‌లో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని మీరాలం ట్యాంక్ సమీపంలో పారేశారు. అక్కడి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

మృతిచెందిన బాలుడి తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అసలు బాలుడు ఎవరు? ఆ బాలుడిని ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ బాలుడి కుటుంబ సభ్యలే ఎవరైనా చేశారా లేక అఘంతకుల ఈ దారుణానికి పాల్పడ్డారా అనే దాని పై పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *