Hyderabad Sperm Scam:హైదరాబాద్ నగరంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో ఒకరి వీర్యం మరొకరికి ఇచ్చారన్న కేసు బయటకొచ్చాక.. జరుగుతున్న దర్యాప్తులో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ఫెర్టిలిటీ సెంటర్లపై జరిపిన దాడుల్లో ఈ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇన్నాళ్లుగా జరిగిన ఈ దందాను చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నది.
Hyderabad Sperm Scam:స్పెర్మ్ క్లినిక్‌లు బిచ్చగాళ్లు, అడ్డా కూలీల నుంచి వీర్యం సేకరిస్తున్నారన్న వాస్తవం తాజాగా వెలుగు చూసింది. బిచ్చగాళ్లకైతే బిర్యానీ ప్యాకెట్లు, అడ్డా కూలీలకు మద్యం ఇస్తూ ఈ దందాను నడిపించారు. చదువుకున్న విద్యావంతులైన వారికి మాత్రం రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ఇస్తూ దందా నడుపుతున్నారు.
Hyderabad Sperm Scam:అదే మహిళలకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ ఇచ్చి అండాలు సేకరణతో స్పెర్మ్ క్లినిక్‌లలో వికృత దందా నడుపుతున్నారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరుతో సికింద్రాబాద్‌లో ఈ దందా నడుపుతున్న డాక్టర్ నమ్రతతో సహా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశాక ఈ చీకటి దందా వెలుగు చూసింది.
Hyderabad Sperm Scam:వాస్తవంగా నిబంధనల ప్రకారమైతే ఆరోగ్యవంతులైన వ్యక్తులు, 21 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు వయసున్న వారి నుంచి, వారికి అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఎలాంటి జన్యువ్యాధులు, అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారి నుంచి వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి 25 సార్లు మాత్రమే వీర్యం సేకరించాలి.
Hyderabad Sperm Scam:ఒకదాత నుంచి ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి. కానీ, ఈ నిబంధనలను పక్కనబెట్టి ఒకే వ్యక్తి నుంచి వారానికోసారి చొప్పున స్పెర్మ్ క్లినిక్‌లు వీర్యాన్ని సేకరిస్తున్నట్టు తేలింది. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్‌లో బిచ్చగాళ్లు, అడ్డా కూలీలతో ఈ దందా గత కొన్నాళ్లుగా సాగుతుందని వెల్లడైంది.