Hyderabad: సౌదీ అరేబియాలో జరిగిన భయంకరమైన బస్సు ప్రమాదం హైదరాబాద్‌లోని విద్యానగర్ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చింది. నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన మొత్తం 18 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నసీరుద్దీన్, ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కోడళ్లు, అలాగే ఆరుగురు చిన్నారులు ఉన్నారు.
రైల్వే శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన నసీరుద్దీన్, వచ్చే వారం హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉన్నప్పుడే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం సౌదీ ఎంబసీ మరియు విదేశాంగ శాఖతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
మక్కా–మదీనా ప్రాంతంలో ప్రమాదం జరిగిన నేపథ్యంలో, మృతుల అంత్యక్రియలు అక్కడిక్కడే జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు కూడా వారు తెలియజేశారు.
