Hyderabad: హైదరాబాద్ నగరంలో రోజుకో తీరుగా మత్తుకు బానిసలైన రౌడీలు, జులాయిలు విపరీతాలకు పోతున్నారు. ఇతరులకు హాని తలపెడుతున్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాను అరికడుతున్నామని పోలీసులు ఎంతగా చెప్తున్నా.. ఎక్కడికక్కడ మత్తు పదార్థాలు దొరుకుతుండటంతో నగరంలో పలుచోట్ల అరాచకాలు ప్రబలుతున్నాయి. దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి.
Hyderabad: తాజాగా హైదరాబాద్ నగరంలో మరో రౌడీషీటర్ గంజాయి మత్తులో తూగుతూ హల్‌చల్ చేశాడు. పాతబస్తీ పరిధిలోని ఐఎస్ సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న నెహ్రూనగర్‌లో రౌడీషీటర్ నజీర్ దౌర్జన్యానికి దిగాడు. భారీ కత్తి చేతబట్టి కేకలు వేస్తూ, రోడ్డుపై వెళ్లేవారిపై దాడులకు దిగాడు. రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాలను ధ్వసం చేశాడు. అతని చేతిలో కత్తి ఉండటంతో అతనిని ఎవరూ వారించలేకపోయారు.
Hyderabad: చాలా సేపు కత్తి చేతబట్టుకొని రోడ్డు పై వెళ్లేవారిని బెదిరిస్తూ, వారి వెంట పడుతూ, అరవసాగాడు. ఈలోగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చేలోగా రౌడీషీటర్ నజీర్ అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ పలుచోట్ల చోటుచేసుకుంటుడటం ఆందోళన కలిగిస్తున్నది. స్థానికులు చాలా అవస్థలు పడుతున్నారు.